01/10/2022
ఇంత గొప్పదైన గోమాతను మనము ఎందుకు దూరము చేసుకొంటున్నాము ?
భారత దేశమును బ్రిటిష్ వాళ్ళు మరియు మొఘాలయీలు పరిపాలించుటచేత , మనము విదేశీయుల సంస్కృతి మోజులో పడి మన సాంప్రదాయాన్నిమరియు సంస్కృతిని విస్మరించాము. ఆవు పవిత్రతను మరచి కేవలం పాలు ఇచ్చే జంతువుగానే పరిగణించి ఎక్కువ పాలిచ్చే విదేశీ జాతులైన Hf,Jersy ఆవులను దిగుమతి చేసుకొని మన జాతులతో సంకరపరచుకొన్నాము. ప్రపంచములోనే అందమైన చాల బలమైన ఒంగోలు జాతి ఆవు కనుమరుగు అవుతోంది . ఒంగోలు ఆవు పాలకు వ్యవసాయానికి కూడా పనికివస్తుంది .మన దేశీ జాతులైన గిర్,సాహివాల్, , తార్పార్కర్, రెడ్ సింధి మొదలైన జాతులు ఎక్కువ పాలిస్తాయి. ఎక్కువ పాలిచ్చే సంతతిని మనం అభివృద్ధి చేయడంలో అశ్రద్ధ వహించాము. బ్రెజిల్ దేశంలో గిర్ జాతిని బాగా అభివృద్ధి పరచి ఒక రోజుకు (ఒక ఆవు) 62లీటర్ల పైగా పాల ఉత్పత్తి ని సాధించారు. మంచి ఒంగోలు జాతి ఆవులు,అబోతులు 5 లక్షల దాకా ఉన్నాయి . కానీ మన దేశంలో డబ్బు కోసం పాపభీతి కూడా లేకుండా కసాయి వాళ్ళకి మాంసము కొఱకు అమ్ముకొంటున్నారు. ఈవిధంగా మన ఆవు జాతులు అంతరించే దుస్థితి వచ్చింది.
మన దేశపు గోజాతులకే మూపురము, గంగడోలు మరియు కొమ్ములు ఉంటాయి . ఈ రకమైన లక్షణాలు కలిగినవే నిజమైన గోమాతలు (ఆవులు) అందుకే ఇవి పూజ్యమైనవి. వీని మూపురము లో సూర్య నాడి ఉంటుంది. సూర్యుని కిరణాల నుండి శక్తిని గ్రహించి పంచ గవ్యాల ద్వారా మనకి ఔషధాలని ఇస్తుంది. ఈ విషయం శాస్త్ర పరిశోధనలలో కూడా నిరూపించబడినది. అందుచేతనే ఆయుర్వేదం లో దేశీ జాతి యొక్క పంచగావ్యాలనే వాడాలి.
ఈ రోజున గోవును పూజించుకోవలన్నా, గో ఉత్పత్తులను ఆయుర్వేదంలో మరియు వ్యవసాయములో ఉపయోగించాలన్నా, పిల్లలకు పాలు ఇవ్వాలన్నా దేశీ జాతి ఆవులు కఱువు అయ్యాయి