21/01/2024
అదిగో..ఈ వ్యవస్థ నాకు #వ్యభిచారి అనే ముద్ర వేసింది..
ఇక్కడ చిన్న పెద్ద తేడా ఉండదు
మొగతనం మొత్తం ఇక్కడే చూపిస్తారు...
ఇదిగో..ఈ సమాజం #వేశ్య అని నన్ను వెలేసింది...
కానీ ప్రతి మగాడికి .నేనే కావాలి
సాయంత్రం 7 దాటకముందే, సూరీడు పోయి చంద్రుడు రాకముందే
నన్ను అనుభవించాలనే ఆశతో మళ్లీ నా గుడిసెలోకి దూరింది... ఈ "సమాజం"
కులం కుమ్ములాటలో
భలైపోయిన నా ఆర్ధికవ్యవస్థను అదునుగా తీసుకొని -
నా అందాన్ని ఆరగించాలని అర్రులుచాచుకుని కూర్చుంది...
కన్న కొడుకు ఆకలితీర్చలేని నా పేదరికాన్ని ఆసరాగా చేసుకొని -
నా కొలతలకి.."వారానికి సరిపడా రేటుకట్టి,
ప్రణయరణరంగంలో నన్ను ఓడించాలని ఆయుధాలు ధరిస్తోంది...
ఈ వికృతసమాజపు అంగంలోనుంచి కారే నాలుగు వీర్యపుచుక్కలకోసం - నా అండంలో జారే రక్తస్రావపు రవాణాకి రంగం సిద్ధం చేస్తుంది.....
నాజూకైన నా నాభి చుట్టూ - తాగిపాడేసిన బీరుసీసా వక్కలతో, ఊదిపాడేసిన సిగరెట్ ముక్కలతో గాయాలు చేయాలని గేయాలాలపిస్తోంది.....
నొప్పితట్టుకోలేక నా నోట్లో నుంచి వచ్చే అరుపులను కూడా - సుఖప్రాప్తిలో వచ్చే మూల్గులా భావించి నా దేహాన్ని దున్నడానికి ఈ సమాజం నాగలిపోటుతో వేటుకి సిద్ధమయ్యింది.....
ఇంతకీ నా అవసరం కోసం వాడబడుతున్న నేను వేశ్యనా? ~ లేదంటే నా అవసరాన్ని ఆసరాగా చేసుకొని వాడుకుంటున్న ఈ సమాజమే వేశ్యనా?...🤔
సమాధానమే దొరకట్లేని ఈ ప్రశ్నతో
#సిద్దార్థ్